ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

  • జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీ
  • ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి 

విశ్వంభర, షాద్ నగర్ : తల్లి జిజియా భాయ్ నేతృత్వంలో  రామాయణ మహాభారతం వంటి గాథలు విని నేర్చుకుని, ఉత్తమమైన వ్యక్తిత్వంతో, తను నమ్మిన భవాని మాత ఆశీస్సులతో మరాఠా సామ్రాజ్య స్థాపనకై పూనుకొని, హిందూ రాజ్యాన్ని దశ దిశల వ్యాపింపజేసిన పోరాట యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద నుండి  చత్రపతి శివాజీ మహారాజ్ వీరాభిమానులు  ఆయన  జయంతిని పురస్కరించుకొని శివాజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి  బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన నవీన్ రెడ్డి మరియు కొందుటి నరేందర్, శ్రీవర్ధన్ రెడ్డి శివాజీ, బండారి రమేష్, మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా  చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి శివాజీ మహారాజ్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుని బైకు ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బజరందల్ నేతలు,చెట్ల వెంకటేష్, మల్చలం మురళి,మధు, సాయి యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: