ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

శివాజీ స్ఫూర్తితో యువత ముందుకుసాగాలి

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

విశ్వంభర, కేశంపేట : శివాజీ స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని  బీజేపీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ కుమ్మరి మహేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఛత్రపతి శివాజీ 395 వ జయంతి సందర్బంగా మండల పరిధిలోని పోమాల్ పల్లి గ్రామంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శివాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భవాని దేవి భక్తుడు భారతదేశ రక్షకుడు వీర శివాజీ పరమత సహనం కలిగిన దేశ వ్యతిరేకులకు సింహస్వప్నం లాంటి వాడని తెలిపారు. గోరక్షకుడు దాత్రికుడు, మీ రక్తాన్ని ధార పోయండి మీకు దేశ ద్రోహుల నుంచి విముక్తి కలిగిస్తానని శివాజీ  ఆనాడే పిలుపునిచ్చారని అన్నారు.నేటి యువకులు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకుసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, ప్రవీణ్ యాదవ్, ఉదయ్, చాకలి మహేష్, కుమ్మరి శివశంకర్, చాకలి వినోద్, భావండ్ల శేఖర్, పోలే పోగు శ్రీకాంత్, అనిల్ యాదవ్, రాజు ,చందు, శ్రీనివాస్, చాకలి శేఖర్, నిదురం నవీన్, చాకలి మల్లేష్, లింగం, కాశన్న , గుగ్గిలచంద్రయ్య, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: