అపదలో అండగా నిలిచిన బిఆర్ఎస్ నాయకులు

  • ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన ముగ్గురు వ్యక్తులు
  • బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం

WhatsApp Image 2025-01-20 at 15.22.16

విశ్వంభర, తలకొండపల్లి:  ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, మర్కెట్ కమిటీ మాజి చైర్మన్, చుక్కాపూర్ మాజి మార్కెట్ చైర్మన్ నాలపురం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన కళ్యాన్ కార్ రఘు, ఎన్నేడ్ల జంగా రెడ్డి, యేశాల పెంటయ్య కుటుంబాలకి ఉప్పల వెంకటేష్, నాలపురం శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షుడు లక్నామోని మల్లేష్ ద్వారా 6 వేల రూపాయల చొప్పున 18 వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకట్ రెడ్డి, రైతు అధ్యక్షుడు మల్లా రెడ్డి, మల్లేష్ ,కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Read More శ్రీ కంఠమహేశ్వర గౌడ యువజన సంఘము నూతన కమిటీ ఎన్నిక.  -అధ్యక్షులుగా మండ అనిల్ గౌడ్,

Tags: