ముగిసిన బ్రహ్మోత్సవాలు
On
విశ్వంభర, రామన్నపేట: మండలంలోని నీర్నెముల గ్రామంలో బ్రహ్మశ్రీ బేతు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో నాలుగు రోజులు శ్రీ సీతారామాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజులో భాగంగా గ్రామంలో ఉన్న ప్రజలంతా అభిషేకానికి నీళ్లు పోయడం జరిగింది. రెండవ రోజు కళ్యాణము, మూడవరోజు అన్నదాన కార్యక్రమం, నాలుగవ రోజు అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలంతా భక్తిశ్రద్ధలతో హాజరై వారి యొక్క మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు సత్యనారాయణ శాస్త్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



