పర్యావరణ భావజాలానికి అద్భుత పురస్కారం
రంగయ్యకురాష్ట్ర స్థాయి అవార్డు.
On
విశ్వంభర, హైదరాబాదు : రవీంద్ర భారతి లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం పురస్కరించుకొని అస్తిత్వం సంస్థ తెలంగాణభాష సాంసృతిక శాఖ సౌజన్యంతో జరిగిన పురస్కారం కార్యక్రమం జరిగింది. బీ ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ కె. రాణి రజిత మాధురి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పలు రంగాలకు చెందిన దాదాపు 20మందికి ఈ పురస్కారాలు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న ఈపీడీసీ (ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ) కి రాష్ట్ర స్థాయి పురస్కారం దక్కింది. ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య ప్రముఖ స్వచ్ఛంద సంస్థ “ఆస్తిత్వం” నుంచి రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సంస్థ అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.



