వరి వెదజల్లే పద్ధతి సాగుపై అవగాహన కార్యక్రమం

వరి వెదజల్లే పద్ధతి సాగుపై అవగాహన కార్యక్రమం

విశ్వంభర, రామన్నపేట: సేవా స్పూర్తి ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు చేసే రైతులకు సోమవారం రోజు కె.వి.కె గడ్డిపల్లి నందు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామ రైతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. నరేష్, డా.కిరణ్, సేవా స్పూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ మాట్లడుతూ, ప్రస్తుత పరిస్థితులలో వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తరిగిపోతున్న భూగర్భ నీటి వనరులు, వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ సమస్య, కూలీల కొరత, వ్యవసాయ ఉత్పాదకాల ధరలు బాగా పెరుగుట వల్లన వరి సాగు గిట్టుబాటు కాక, వ్యవసాయ ఖర్చును తగ్గించుటకు రైతులకు నేరుగా విత్తే వరిసాగు పై అవగాహన కల్పించడం జరిగింది. వరి సాగు లాభసాటిగా చేసుకోవటానికి యాంత్రీకరణ చాలా అవసరం. పొలం తయారీ, విత్తడం, ఎరువులు వేయడం, కలుపు మందులు, క్రిమిసంహారక మందులు, పిచికారీ చేయటం, వరికోత, కట్టడం, నూర్పిడి, ఆరబెట్టడం వంటి అన్ని పనులకు యంత్రములు, డ్రోన్స్ అందుబాటులో ఉన్నవి. ఇవి ఉపయోగించి సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. నాట్ల వరిసాగు ఖర్చు కంటే నేరుగా విత్తే వరిసాగుకు రూ 8000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఖర్చు తగ్గుతుందనీ తెలిపారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ రకాలుగా శాస్త్రీయ పద్ధతిలో అవలంబించే వరి, నిమ్మ, బత్తాయి, కూరగాయలుపై  క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలతో రైతులు పరిశీలన చేసిన అనంతరం వరి వెదజల్లే పద్ధతిలో ఇతరులకు స్ఫూర్తినిస్తున్న గ్రామ ఆదర్శ రైతు ముక్కముల రవిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కక్కిరేణి గ్రామానికి చెందిన రైతులు కన్నెబోయిన సైదులు, వెంకన్న, బెక్కంటి మహేందర్, వేముల సైదులు, మెట్టు మధు, చిల్ల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags: