పంతులు మధుబాబు కు అవార్డు - గ్రామానికి దక్కిన గౌరవం
On
విశ్వంభర, భూదాన్ పోచంపల్లి ;- టీచర్స్ డే సందర్బంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను పొందిన ముక్తాపూర్ యూ పీఎస్ ప్రధానోపాధ్యాయులు పంతులు మధు బాబు ను గ్రామ పెద్దలు, మాజీ కౌన్సిలర్ కొంగరి కృష్ణ , మాజీ సర్పంచ్ మునుకుంట్ల బాలచందర్ గౌడ్, రాజ మల్లేశం గౌడ్, నక్కల రాజి రెడ్డి, సాయి లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కొంగరి కృష్ణ మాట్లాడుతూ ఇది మా గ్రామానికి దక్కిన గౌరవం అని, మంచి మనసుకు , మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం మధుబాబు సార్ అని అయ్యన కొనియాడారు. ఇలాగే చాలా అవార్డ్స్ రావాలని , మా ఊరి ప్రధానోపాధ్యులు మా పిల్లల భవిశ్యత్తుకు మార్గం చూపాలని కోరారు. ముక్తపూర్ గతంలో ఆదర్శ గ్రామం గా పేరుగాంచింది అని గుర్తు చేశారు.



