ఆసక్తి రేకెత్తిస్తున్న మండల ఆర్యవైశ్య అధ్యక్ష ఎన్నిక.
విశ్వంభర, నార్కట్పల్లి : ఎంతో ప్రతిష్టాత్మకమైన నార్కట్పల్లి మండల ఆర్యవైశ్య అధ్యక్షుని ఎన్నికలు, మార్చ్ రెండో తారీఖున పోలింగ్ జరగనుండడంతో మండల ఆర్యవైశ్యులలో ఎన్నికల సందడి నెలకొంది. ఈసారి ఏకగ్రీవానికి అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది, ఈదఫా అధ్యక్ష పీఠం ఆశించిన మండల ఆర్యవైశ్య ప్రముఖుడు ఒకరు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లయితే సంఘ భవన అభివృద్ధికి భారీ విరాళం ఇవ్వ చూపగా ఆర్యవైశ్యులు సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్లు తెలుస్తుంది. దీనితో ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అధ్యక్ష అధ్యక్ష బరిలో ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనితో చాలావరకు. అధ్యక్షునిగా ద్విముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. తాజా మాజీ అధ్యక్షుని మద్దతుతో చాప కింద నీరు లాగా ప్రచారం ప్రారంభించిన అభ్యర్థి ఒకరు,మరో అభ్యర్థి కూడా తన ప్రచారము ఉధృతం చేస్తున్నట్టు తెలిసింది, ఈ ఎన్నికలు వైశ్యులలోనే కాకుండా వైశ్యేతరులలో కూడా తీవ్ర ఆసక్తి ని కలిగిస్తున్నవి, ఎవరు గెలిచినా, విబేధాలు అన్ని మరచి వైశ్యుల ఐక్యత కు అభ్యున్నతికి పాటు పడాలని మండల ఆర్య వైశ్యులు కోరుకుంటున్నారు ఫలితం కొరకు మరో వారం వేచి చూడాలిసిందే.



