ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్

 ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్

విశ్వంభర, సూర్యాపేట : సమాజ సేవలో చల్లా లక్ష్మీకాంత్ సేవలు అభినందనీయమని ఉండ్రుగొండ గిరి దుర్గం డెవలప్మెంట్ చైర్మన్,ప్రముఖ వైద్యులు డా. రామూర్తి యాదవ్ తెలిపారు. చల్లా లక్ష్మీకాంత్ సూర్యాపేట ఆర్య వైశ్య మహా సభ కోశాధికారిగా నియామకం అయిన సందర్భంగా మిత్ర బృందం ఆధ్వర్యంలో గురువారం ఆయన కార్యాలయంలో  ఘనంగా శాలువాతో సన్మానించి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చల్లా లక్ష్మీకాంత్ చిన్నతనం నుండి స్వయంకృషితో ఎదిగి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. పేద ప్రజలకు నిత్యవసర సరుకులు,అన్నదానాలు నిర్వహించడం తోపాటు  ఎంతోమంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందించారని కొనియాడారు. రాజకీయంగా అన్ని పార్టీలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాడని తెలిపారు. మును ముందు ఇంకెన్నో పదవులు అలంకరించి పేద ప్రజలకు సేవలు అందించాలని కొనియాడారు. రాజకీయాల్లో కూడా ఉన్నత  పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిగా నియమించడము లో సరైనా  నిర్ణయం తీసుకున్న రాష్ట్ర కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, తండు శ్రీనివాస్ గౌడ్, నిమ్మల వెంకన్న, బైరబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement