అంజిరెడ్డి, కొమురయ్య లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి
- పట్టభద్రుల, టీచర్స్ ల సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి
- బీజేపీ నేతలు నాగేశ్వర్ రెడ్డి, జోగిరెడ్డి, కళ్యాణ్ చంద్ర
విశ్వంభర, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్, మహాత్మా నగర్, తిమ్మాపూర్ ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈనుకొండ నాగేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి ఎడ్ల జోగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి , సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర లు సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పట్టభద్రులు, టీచర్స్ లను కలిసి బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి,వారిసమస్యలనుగాలికివదిలేసిందన్నారు.అందుకే నిరుద్యోగ పట్టభద్రులు, టీచర్స్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తగిన గుణపాఠం చెప్పారని, అభయంతోనే నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ని కొనితెచ్చుకుందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత బిఆర్ఎస్ బాటలోనే నడుస్తుందన్నారు. నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతినెల రూ.4000 లు ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, 14 నెలల కాలమైనా ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఒక్కో నిరుద్యోగి 54 వేల
రూపాయలు బాకీ పడిందన్నారు. ఇక ఉద్యోగులు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేని పరిస్థితిలో ఉన్నారని, టీచర్స్ అనేక సమస్యలు ఇబ్బందులతో బాధపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. పట్టభద్రులు, టీచర్స్ ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి హామీ తో నిరుద్యోగ పట్టబద్రుల ఓట్లు దండుకొని మోసం చేసిన కాంగ్రెస్ కు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు కనీస బెనిఫిట్స్ కూడా అందించలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టీచర్స్ కూడా తగిన బుద్ధి చెప్తారన్నారు. పట్టభద్రుల, టీచర్స్ ల సమస్యల కోసం కొట్లాడింది, ముఖ్యంగా 317 జీవో కు
వ్యతిరేకంగా ఉద్యమించింది కేవలం బీజేపీ యేనని ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆశీర్వదిస్తే పట్టభద్రుల, టీచర్స్ గొంతుకను శాసనమండలిలో వినిపించి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతం శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గడ్డం అరుణ్, నాయకులు కొత్తూరి శ్రీనివాస్, జంగాపల్లి వినయ్, తదితరులు పాల్గొన్నారు.



