అభయ హస్తం కాదది భస్మాసుర హస్తం
బిజెపి కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి
విశ్వంభర, కొందుర్గు : ప్రజలు అభయహస్తం అని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జనాల పాలిట బస్మాసుర హస్తంగా తయారయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ ఆర్ ఎస్ ) నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బిజెపి కొందుర్గు మండల అధ్యక్షుడు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి హెచ్చరించారు. గతంలో ప్రజల జేబులను ఖాళీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు దానిని కొనసాగించడం దారుణం అన్నారు. ప్రజలను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలను దోచుకునే దానిపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై పెట్టాలని, ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడానికి ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు.



