కొత్త కోటలో రాపోలు కు ఘన స్వాగతం

కొత్త కోటలో రాపోలు కు ఘన స్వాగతం

విశ్వంభర, వనపర్తి జిల్లా :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల సమస్యలపై  తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పర్యటనలు చేపట్టారు. కొత్తకోట పట్టణం పద్మశాలి పి ఆర్ టి యూ రిటైర్డ్ ఉద్యోగులు చంద్రమౌళీశ్వర  శ్రీ భక్త  మార్కండేయ స్వామి దేవాలయం లో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు  రాపోలు వీర మోహన్ ను  మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్వాగతం పలికి ఆత్మీయ సత్కర్మ చేపట్టారు. వారితో పద్మశాలి నాయకత్వంపై , చేనేత సమస్యలను ఆరా తీసారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ పెద్దలు, చేనేత నాయకులూ , కార్మికులు పాల్గొన్నారు. 

Tags: