ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నాయకులతో సైబరాబాద్ పోలీసుల సమావేశం

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నాయకులతో సైబరాబాద్ పోలీసుల సమావేశం

  • ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలి.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి పోలీసుల అవగాహన

Cyberabad Police: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన పెద్దలు, నాయకులతో పోలీసులు కౌన్సెలింగ్ సమావేశం నిర్వహించారు. కమ్యూనిటీ సభ్యులు ప్రజలు, వ్యాపారులతో వ్యవహరించే తీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

డబ్బుల కోసం సాధారణ ప్రజలను, షాపు యజమానులను ఇబ్బందులకు గురిచేయవద్దని పోలీసులు సూచించారు. డబ్బులు అడిగే సమయంలో ఎవరిపైనా ఒత్తిడి చేయడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడకుండా సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

Read More తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ ప్రక్షాళన ప్రచారం.. కీలక నేతల పేర్లు తెరపైకి

సైబరాబాద్ పరిధిలో ప్రజలు, వ్యాపారులు ప్రశాంతంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో కమ్యూనిటీ పెద్దలు, నాయకులు తమ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు.

ప్రజలతో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించవద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు.

కమ్యూనిటీ నాయకులు కూడా పోలీసుల సూచనలను తమ సభ్యులకు తెలియజేసి.. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. సమాజంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు అందరూ సహకరించాలని సూచించారు.

Tags:  

Advertisement

LatestNews

ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026
ఎరుకల సమస్యలపై  కలెక్టర్ కు వినతి 
వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*
నేడు పేరు నమోదు కై గోడపత్రిక ఆవిష్కరణ.
 ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి- లక్ష్మీ దంపతులే మాకు ఆదర్శం  - కోడి శ్రీనివాసులు- అరుణ దంపతులు 
 గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలి... - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు..
చందనవెల్లి సర్పంచ్ నవనీత స్వామికి ఘనంగా జన్మదిన వేడుకలు