పాతబస్తీ గౌలిపురలో ఆపరేషన్ సింధూర్ గణనాయకుడు
విశ్వంబర/ గౌలిపుర :- ఆల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక కొత్త దనంతో ప్రజలను ఆకర్షించే విధంగా రూపొందిస్తూ ఈసారి పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ విగ్రహాన్ని తయారు చేయిస్తే బాగుంటుందని ఆలోచనతో శ్రీకాంత్, భాస్కర్, సాయిబాబా, నర్సింగ్, చంద్ర ఈ ఐదుగురి ఆలోచనతో ఆపరేషన్ సింధూర్ విగ్రహాన్ని రూపకల్పనకు ప్రజల ముందుకు తీసుకొచ్చారు, భారతదేశ ఖ్యాతి, మన ఆడవారి నుదిటిన సింధూరానికి ప్రతిరూపమైన ఈ విగ్రహం ప్రజలల మన్నలను పొందుతుంది. ఈ విగ్రహాన్ని చూడడానికి చాలామంది భక్తులు రావడం సంతోషంగా ఉందని శ్రీకాంత్ తెలిపారు. అలాగే మా దగ్గర నిత్య పూజలు, సంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించినట్టు తెలిపారు. వివిధ పార్టీ నాయకులు, ప్రముఖులు తమ తమ సంతోషాన్ని పంచు కుంటుంటే సంతోషంగా ఉందని శ్రీకాంత్ తెలిపారు. మేము గత 46 సంవత్సరాల నుండి వినాయకుని ప్రతిష్ట చేస్తున్నామని రాబోయే కాలంలో కూడా భక్తుల మన్ననల ను పొందే విధంగా చూస్తామని తెలిపారు



