అజిత్ పవార్ కు షాక్.. కేంద్ర కేబినెట్ లో దక్కని చోటు..

ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాల సాయంతోనే మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఈ క్రమంలోనే మిత్ర పక్షాలకు ఈ సారి ఎక్కువ కేంద్రమంత్రి పదవులు కేటాయించింది బీజేపీ పార్టీ. 

టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చింది. అయితే కేంద్రంలో మోడీకి సపోర్టుగా ఉంటున్న అజిత్ పవార్ కు మాత్రం షాక్ తగిలింది. ఈ సారి మహారాష్ట్రలో ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీకి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒకే సీటులో గెలిచింది.  ఆ పార్టీ తరఫున సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ గెలిచారు. 

ఆయనకు మోడీ కేబినెట్ లో పదవి ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఆయనకు కేవలం సహాయమంత్రి పదవి దక్కింది. దాంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను గతంలో కేంద్రమంత్రిగా పని చేశానని.. సహాయ మంత్రి ఇవ్వడం అంటే తన స్థాయిని తగ్గించడమే అంటూ తెలిపారు. అయితే భవిష్యత్ లో కచ్చితంగా కేంద్రమంత్రి పదవి ఇస్తామని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు.

🕒 09 Jun 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/national/shock-for-ajit-pawar-is-not-getting-a-place-in-union-cabinet/article-1558

Related Posts