హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం 

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం 

  • రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0 గా  నమోదు
  • ఇళ్లలోనుంచి పరుగులు తీసిన జనం
  • తప్పిన ప్రాణ, ఆస్తి నష్టం 

ఉత్తరభారతాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. అక్కడి కులు ప్రాంతంలో ఇవాళ(శుక్రవారం) ఉదయం 3:39 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. 

ఇదివరకు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని చంబా జిల్లాలో ఏప్రిల్ 24వ తేదీన రాత్రి సమయంలో భూకంపం సంభ‌వించింది. చంబా ప‌ట్ట‌ణంతో పాటు 100 కిలోమీట‌ర్ల దూరంలోని మ‌నాలీలోనూ భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 5.3గా న‌మోదైట‌న‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ అధికారులు వెల్ల‌డించారు. 10 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైన‌ట్లు పేర్కొన్నారు. పంజాబ్, హ‌ర్యానాలోని ప‌లు ప్రాంతాల్లో కూడా ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

Related Posts