BREAKING: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా..!
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు మరో సారి నిరాశే మిగిలింది. బెయిల్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడంలేదు.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు మరో సారి నిరాశే మిగిలింది. బెయిల్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడంలేదు. వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ఇవాళ(మే16) విచారణ చేపట్టింది ఢిల్లీ హైకోర్టు.
అయితే ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. తీహార్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. గత నెల 22న రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగ్గా న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే2కు తీర్వు రిజర్వు చేశారు. అయితే మే2న తీర్పు వస్తుందని అంతా భావించారు.
ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు మే-06కు రిజర్వ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్ పిటిషన్లపై తీర్పును మే-06న వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరిస్తూనే ఉన్నది. ఆ మధ్య తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని బెయిల్ మంజూరు చేయాలని కోరినప్పటికీ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరినా కోర్టు తిరస్కరించింది. తాజాగా బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.