మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. 14 మంది మృతి..!
పిడుగుపాటుతో 11 మంది
12 రోజులుగా విస్తారంగా పడుతున్న వాన
మహారాష్ట్రలో వర్షం నానా బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 14 మంది మృతి చెందారు. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. వరద కాలువలు పొంగిపొర్లుతున్నాయి. జనాలు చెల్లాచెదురు అయిపోయారు. లోటత్తు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. జూన్ 1 అక్కడ వర్షాలు ప్రారంభం అయ్యాయి. ఈ 12 రోజుల్లో దాదాపు 14 మంది మరణించారు. ఇందులో పిడుగుపాటు కారణంగా 11 మంది చనిపోయారు.
మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రకారం గడిచిన రెండు రోజుల్లోనే పర్భానీ, హింగోలి జిల్లాల్లో నలుగురు చనిపోయారు. జూన్ 1 నుంచి మరఠ్వాడాలోని ఏడు జిల్లాల్లో వర్షాల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 14 ఏళ్ల బాలుడు, 40 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. ఇక వరద నీటిలో కొట్టుకుపోయి మరో ఇద్దరు చనిపోయారు.
మొత్తం ఎనిమిది జిల్లాల్లో వర్షం ఈ బీభత్సం సృష్టించింది. మనుషులతో పాటు జంతువులు కూడా ప్రాణాలు విడిచాయి. 251 సాదు జంతువులు చనిపోయాయి. గత రెండు రోజుల్లోనే ఏకంగా 99 జంతువులు మృత్యువాత పడ్డాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్, ఆరెంజ్ అలెర్ట్ లను ఆ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది.