వాళ్ళను బాధ పెట్టడం ఇష్టంలేకే పెళ్లి చేసుకోవడం లేదు: ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళికి రెడీ అయినట్లు గత ఏడాది నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ పెద్దమ్మ కూడా ఆ మధ్య ఇదే చెప్పారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళికి రెడీ అయినట్లు గత ఏడాది నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ పెద్దమ్మ కూడా ఆ మధ్య ఇదే చెప్పారు. దీంతో డార్లింగ్ మ్యారేజ్‌కు సంబంధించి ఎప్పుడెప్పుడు గుడ్‌న్యూస్ వస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
అయితే, బుధవారం జరిగిన ‘కల్కి’ స్పెషల్ ఈవెంట్‌లో యాంకర్ సుమ ప్రభాస్‌ను ఆటపట్టించింది. మొన్నెప్పుడో స్పెషల్ వ్యక్తి వస్తుందని అనగానే.. ఎంత మంది అమ్మాయిల గుండెలు పగిలిపోయాయో తెలుసా? అని సుమ అనగానే.. ప్రభాస్, ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. అమ్మాయిలందరినీ బాధ పెట్టడం ఇష్టం లేకే పెళ్లి చేసుకోవడం లేదని సుమకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. కాగా, ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.