సైడ్ డ్రైనేజీ కాలువల శంకుస్థాన చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డా.భూక్యా మురళీ నాయక్

  • మాటల ప్రభుత్వం కాదు - చేతల ప్రజా ప్రభుత్వం ఇది
  • అర్హులకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాం.
  • కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు జాన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి

WhatsApp Image 2025-01-20 at 14.58.23

విశ్వంభర మహబూబాబాద్: నేడు చోక్లతండ గ్రామ పంచాయతీ పరిధిలో మేగ్యా తండలో CDF నిధులతో మంజూరైన సుమారు 5 లక్షల రూపాయల వయ్యంతో సైడ్ డ్రైనేజీ కాలువల శంకుస్థాన కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్ , డిసిసి అధ్యక్షులు జాన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి.

Read More మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్

ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ ల నిర్మాణం పనులు చెప్పాడుతామని ఎమ్మెల్యే  చెప్పుకొచ్చారు. మంజూరు చేసిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి నాణ్యత ప్రమాణాలు అమలు చేస్తున్నామన్నారు.

మీ ఊరులో గ్రామసభ ఏర్పాటు చేస్తారు దయచేసి మీరందరు మీకు ఏ రోజైతే గ్రామ సభ ఏర్పాటు చేస్తారో ఊరు వాళ్లందరూ ఆయా తండాలు ఉండి అధికారులు వచ్చినప్పుడు మీ ఇల్లు చూపించి మీకున్నటువంటి రేషన్ కార్డులు మీ పేరు ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి తర్వాత నాకు రాలేదు. రేపటి నుంచి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

ఆ షెడ్యూల్లో ప్రతి గ్రామపంచాయతీలో ఎక్కడైతే గ్రామ సభలు పెడతారో దయచేసి ఎవరికన్నా రేషన్ కార్డులు రాకపోతే మీరు వెంటనే పోయి సంబంధిత అధికారులను రేపటి నుంచి కలిసి ఆ గ్రామ సభలో మీకు రేషన్ కార్డు వచ్చే విధంగా మీ పేరు పెట్టుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి రేషన్ కార్డు ప్రముఖ్యం. దయచేసి మీరందరూ రేషన్ కార్డులో మీ పేరు ఉండేటట్టుగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూన్నాను. గతంలో హోలియా కమిలి ఆధ్వర్యంలో బావి తీయడం జరిగింది అని చెప్పారు అది కూడా స్టీనింగు ఇంకా రాబోయే రోజుల్లో నేను 15 లక్షలు స్పెషల్ ఫండ్లో నుండి ఇస్తానన్నారు 

 మనకు జనవరి 26వ తారీకు నాడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇవ్వబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిట్టకంటి రాంరెడ్డి, కాంగ్రెసు సీనియర్ నాయకులు భూక్యా సుందర్ నాయక్,గ్రామ పార్టీ అధ్యక్షులు గుగులోత్ మురళి,ఉపాధ్యక్షులు బోడ సురేష్ ,లాలావత్ రమేష్,బోడ బాలకిషన్, నరేందర్, హోలీ ,సుందర్ ,కొండయ్య ,లింగ శ్రీను ,శేఖర్ ,అంజిబాబు,గ్రామ పంచాయతీ సెక్రెటరీ మాధవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ,A.e రాజశేఖర్ గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Tags: