రష్యాలో విషాదం.. నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి
రష్యాలో విషాదం నెలకొంది. నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో ఉన్న నదిలో వాళ్లు మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
రష్యాలో విషాదం నెలకొంది. నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో ఉన్న నదిలో వాళ్లు మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నోవోగరోడ్ సిటీలో ఉన్న స్టేట్ యూనివర్సిటీలో ఆ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు.
ఓ అమ్మాయి నది నీటిలో కొట్టుకుపోతున్న సమయంలో ఆమెను రక్షించేందుకు మిగితా ముగ్గురు నదిలోకి దిగారు. అయితే వాళ్లు కూడా ఆ నది నీటిలో మునిగిపోయారు. వాళ్లతో ఉన్న మరో ఓ విద్యార్థి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు పంపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొన్నది. బంధువులకు మృతదేహాలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రాణాలతో బయటపడ్డ ఓ విద్యార్థికి చికిత్స అందిస్తున్నట్లు మాస్కోలోని భారతీయ ఎంబసీ పేర్కొన్నది. బాధిత బంధువులకు సమాచారాన్ని చేరవేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల వివరాలు తెలియాల్సివుంది.
Body Of One Indian Student Recovered From Russian River, Lone Survivor Leaves Hospital Today
— RT_India (@RT_India_news) June 6, 2024
Search operations for the 4 missing students were hindered by heavy rain on Wednesday, however the remains of one unfortunate was found June 5.
The 19-yr-old female student, who was… https://t.co/O9fdqyjKt3 pic.twitter.com/OZDM2QKTbB