మెక్సికోలో తీవ్ర విషాదం… ఎన్నికల ప్రచారంలో స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి

మెక్సికోలో తీవ్ర విషాదం… ఎన్నికల ప్రచారంలో స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి

విశ్వంభర, వెబ్ డెస్క్ : మెక్సికోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి చెందగా..మరో 50 మందికి పైగా గాయపడ్డారు. శాన్ పెడ్రో గార్జా గార్షియా పట్టణంలో సిటిజన్స్ మూవ్‌మెంట్ పార్టీ సభ్యులు బహిరంగ సభ కోసం స్టేజీ ఏర్పాటు చేశారు. 


ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో భారీగా ఈదురు గాలులు రావడంతో స్టేజీ ఒక్క సారిగా కూలిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన లైట్లన్నీ కింద ఉన్న వారిపై పడిపోయాయి. దీంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పతికి తరలించారు. 

Read More మక్కా వైపు దూసుకొచ్చిన హౌతీ డ్రోన్‌ను అడ్డుకున్న సౌదీ


ఈ ఘటనను న్యూవో లియోన్ గవర్నర్ శామ్యూల్ గార్సియా ధ్రువీకరించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తుపాను కారణంగా ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. అయితే సభా వేదికపై ఉన్న సిటిజెన్స్ మూవ్ మెంట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అన్ని ప్రచార కార్యకలాపాలను నిలిపివేస్తున్నానని, పరిస్థితిని పర్యవేక్షించడానికి రాష్ట్రంలోనే ఉంటానని అల్వారెజ్ చెప్పారు.

Related Posts

Advertisement

LatestNews

శ్రీ లక్ష్మనేశ్వర  స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 
ఒకరికి ఒకే ఓటు.. అనర్హుల పేర్లకు చోటు లేదు!,-డా. వైభవ్ రెడ్డి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పడమటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తి రాఘవేందర్
సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 
ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026