దావోస్ లో నెం 1 శ్రీధర్ - రోబోటిక్ కొరియర్ సర్వీస్ పరిశీలన
సిఎన్ బిసి ప్రతినిధి బృందంతో చర్చ కార్యక్రమం
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం
విశ్వంభర, దావోస్ : దావోస్ లో జరుగుతున్నా ప్రపంచ ఆర్ధిక వేదికపై పారిశ్రామిక సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త నెంబర్ 1 శ్రీధర్ తన బృందంతో కలిసి దావోస్ వీధుల్లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ రోబోటిక్ కొరియర్ సర్వీస్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్‌లతో కలిగిన రోబోటిక్ కొరియర్ సర్వీస్‌లను పరిశీలించారు. అలాగే నెం 1 శ్రీధర్ సిఎన్ బిసి ప్రతినిధి బృందంతో సమావేశంలో పాల్గొన్నారు. 5జి & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు , శాటి లైట్ ఇంటర్నెట్‌తో మొబైల్ సేవలను ఇంటర్‌లింక్ చేయడం గురించి పారిశ్రామిక ప్రతినిధులకు వివరించారు. ఇండియా కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుంటి శ్రీధర్ రావు ప్రపంచ ఆర్ధిక వేదికపై ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ రావు ప్రపంచ దేశాల పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార పెట్టుబడులకు ప్రపంచ వ్యాపారవేత్తలతో భవిష్యత్తు ప్రణాళికలును సిద్ధం చేస్తున్నారు. దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు , రేవంత్ రెడ్డి , మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవిస్ తో పాటు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ , తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు , మహారాష్ట్ర ఐటీ మంత్రి ఉదయ్ సమంత్ , పలు దేశాల ప్రతినిధులు, వ్యాపారవేత్తలతో కలిసి సదస్సులో పాల్గొన్నారు..jpeg)



