నేత్రదానం చేయండి మరో మారు జీవించండి

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరీక్షిత్ నరేంద్ర

WhatsApp Image 2025-01-20 at 15.35.19

విశ్వం భర, ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ కళావతి  ఆదేశానుసారంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు రామ్ రెడ్డి లయన్ 'ఐ' ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పరీక్షిత్ నరేంద్ర  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి మరోమారు జీవించాలని నేత్రదానం మహాదానమని నేత్రదానం చేసి మరో ఇద్దరికి దృష్టి భాగ్యం కల్పించిన వారు అవుతారని ఆయన పిలుపునిచ్చారు. కంటి వైద్యులు ఎం. చంద్రశేఖర్  ఆధ్వర్యంలో పాఠశాలలో, గ్రామాల్లో గాని ఆశా వర్కర్ల ద్వారా మండల పరిసర గ్రామ ప్రాంతాలలో నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను అవగాహన కల్పించి నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చే విధంగా చైతన్య కలుస్తామని ఆయన పిలుపునిచ్చారు. ఈ శిభిరంలో కంటి వైద్యులు ఏం చంద్రశేఖర్ 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 22 మందిని ఐ ఒ ఎల్ ఆపరేషన్ నిమిత్తం రామ్ రెడ్డి లయన్ ఐ ఆసుపత్రికి తరలించినట్లు పిఆర్ఓ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంయుక్త కార్యదర్శి ఎంగలి బాలకృష్ణ, క్లబ్ పి ఆర్ ఓ ఎం ఏ పాష, క్లబ్ సభ్యులు కొర్వి వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్ తిరుపతిరెడ్డి, డిఇఓ విష్ణు, ఆస్పత్రి సిబ్బంది తదితరు పాల్గొన్నారు.

Read More స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి

Tags: