ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టింది.

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 20మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్ షహర్ నుంచి భక్తులు వైష్ణో దేవిని దర్శించుకోవడానికి మినీ బస్సులో బయల్దేరారు. 

ఈ క్రమంలో ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలై ఏడుగు మృతిచెందగా మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. బస్సులోని ప్రయాణికులు ఒకే కుటుంబానికి చెందిన వారీగా గుర్తించారు. 

Read More Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబాలా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Related Posts