హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్

హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్

ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప అరెస్టయ్యారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకునన్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.

ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప అరెస్టయ్యారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకునన్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్తో పాటు మరో పది మందిని అరెస్టు చేశారు పోలీసులు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు కన్నడ మీడియా ప్రచారం చేస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసముంటున్న రేణుకా స్వామి జూన్ 1న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. జూన్ 8న ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. జూన్ 9వ కామాక్షిపాళ్యం సమీపంలోని ఓ అపార్ట్మెంట్ పక్కన ఉన్న కాలువలో మృతదేహం కనిపించింది. కుక్కలు శవాన్ని పీక్కుతింటుండగా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారాన్ని అందించాడు. 

మృతుడు రేణుకా స్వామిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ కేసు విచారణలో భాగంగా ఇద్దరు నిందితులు నటుడు దర్శన్ పేరు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంగళవారం ఉదయం మైసూర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా మృతుడు రేణా స్వామి చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలుస్తోంది.  దర్శన్ భార్యకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, దర్శన్ కన్నడలో అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన మహేష్‌బాబు ‘పోకిరి’ సినిమాను కన్నడలో రీమేక్ చేశాడు. 

Related Posts