ముఖ్యమంత్రి గారూ.. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

  • మైనింగ్ కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న మైలారం గ్రామస్తులు
  • ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం
  • అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్

Harish Rao hits out at Centre for raising prices of medicines

విశ్వంభర, నాగర్ కర్నూల్: మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్టు చేయడం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి, ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం.

ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు.? ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Read More ఘనంగా గురు నానక్ లో  బ్రాండ్ ప్రమోషన్ ఎగ్జిబిషన్ 

Tags: