విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్ వారం రోజుల పాటు మూసివేత

విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్ వారం రోజుల పాటు మూసివేత

  • హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులకు పున్నమి ఘాట్‌లో పార్కింగ్

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘాట్‌రోడ్‌లో మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 22 ఉదయం నుంచి వారం రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఘాట్‌రోడ్‌ మూసివేత సమయంలో భక్తులు శ్రీ కనకదుర్గానగర్ మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ వైపు నుంచి విజయవాడకు వచ్చే భక్తుల వాహనాలను పున్నమి ఘాట్ వద్ద పార్కింగ్‌కు అనుమతించనున్నారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

Read More చెన్నైలో హనుమాన్ ఆలయ ఉత్సవంలో యాక్షన్ కింగ్ అర్జున్.. పల్లకీ మోసిన నటుడు

విశాఖపట్నం, చెన్నై వైపు నుంచి వచ్చే భక్తుల కోసం సీతమ్మ వారి పాదాల వద్ద వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి ఆలయం వరకు భక్తులను తరలించేందుకు ఉచిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు.

దసరా ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు తమ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపి, అక్కడి నుంచి ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ సూచించారు.

ఘాట్‌రోడ్ మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు భక్తులు పోలీసు, ఆలయ అధికారుల సూచనలను పాటించాలని అధికారులు కోరారు. దసరా ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాకపోకలు సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts