ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరేనా..?

ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరేనా..?

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అటు కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రెండు చోట్లా చంద్రబాబుకు తిరుగులేని పవర్ దక్కింది. అంటు కేంద్రంలో కూడా ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు దయతలిచే పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు ఏపీ నుంచి కేంద్రమంత్రులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు.

ఈ సారి ఏపీ కోటాలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇంకొందరు కూడా పోటీలో ఉన్నారు. చంద్రబాబు కనీసం నాలుగు కేంద్రమంత్రి పదవులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అటు జనసేనలో ఇద్దరు ఉన్నారు కాబట్టి.. ఒకరికి అయినా ఇస్తారని అంటున్నారు. ఆ ఛాన్స్ వస్తే జనసేనలో సీనియర్ అయిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అదృష్టం వరిస్తుంది. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ఇక ఏపీ నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పేరు కచ్చితంగా ఉంటుంది. ఆమెతో పాటు సీఎం రమేష్, శ్రీనివాసవర్మల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏపీ కోటాలో టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశం ఉండటంతో.. ఏపీ బీజేపీ కోటాలో పురంధేశ్వరికి మాత్రమే కేంద్రమంత్రి పదవి వరిస్తుందని తెలుస్తోంది. 

ఆమెకు మోడీ దగ్గర మంచి పట్టు ఉంది కాబట్టి.. ఆమె రికమండేషన్ తో సీఎం రమేశ్ కు కూడా మంత్రి పదవి వచ్చేఛాన్స్ ఉందంటున్నారు. కాకపోతే ఏపీలో బీజేపీని రాబోయే రోజుల్లో విస్తరించాలని కేంద్రం భావిస్తే గనక.. ఎక్కువ పదవులు కేటాయించే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి మరి ఎవరికి పదవులు వరిస్తాయో.

 

Related Posts