అనంతపురంలో వాహన తనిఖీలు.. పత్రాలు పరిశీలించిన పోలీసులు
ఎన్టీఆర్ మార్గ్‌లో వాహన తనిఖీలు.. పోలీసుల తనిఖీలు ముమ్మరం
Anantapur One Town Police: అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ పరిధిలో జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వన్‌టౌన్ ఎస్‌ఐ తిరుపాల్, ఏఎస్‌ఐ, కానిస్టేబుళ్లు కలిసి ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారుల ఆర్‌సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తదితర పత్రాలు, నిబంధనలను పరిశీలించారు. అవసరమైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారిపై చలాన్లు విధించారు. ముఖ్యంగా ఆర్‌సీ లేని వాహనాలను ఆపి వాటి వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆ వాహనాలు సంబంధిత యజమానులవేనా, లేక ఎక్కడైనా చోరీకి గురైన వాహనాలా అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీశారు. రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు.