ఆ శాఖలు ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలుః నారా లోకేష్‌

ఆ శాఖలు ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలుః నారా లోకేష్‌

 

నేడు మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ కు కూడా కీలక శాఖలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఆయనకు హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖలను అప్పగించారు సీఎం. ఈ సందర్భంగా నారా లోకేష్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. 

Read More పది రోజులుగా కరెంట్ క‌ట్.. హాంపాపురంలో కరెంట్ కోసం అర్ధరాత్రి రోడ్డెక్కిన రైతులు

ఈ సందర్భంగా లోకేష్ ఇలా రాసుకొచ్చారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడి గారికి ధన్యవాదాలు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. 

గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను. రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు  ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను అంటూ ఆయన రాసుకొచ్చారు.

Related Posts

Advertisement

LatestNews

ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026
ఎరుకల సమస్యలపై  కలెక్టర్ కు వినతి 
వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*
నేడు పేరు నమోదు కై గోడపత్రిక ఆవిష్కరణ.
 ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి- లక్ష్మీ దంపతులే మాకు ఆదర్శం  - కోడి శ్రీనివాసులు- అరుణ దంపతులు 
 గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలి... - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు..
చందనవెల్లి సర్పంచ్ నవనీత స్వామికి ఘనంగా జన్మదిన వేడుకలు