చిత్తశుద్ధితో పని చేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారు : చంద్రబాబు 

 విశ్వంభర, ఏపీ : ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగోసారి సీఎంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆదివారం టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..గత 20 ఏళ్లలో గెలవని చోట కూడా ఈసారి విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని వెల్లడించారు. ఎన్నికల్లో మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పని చేశారని కొనియాడారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన కార్యకర్తల ఋణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.

ఐదేళ్ల పాటు కార్యకర్తలు, నేతలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిందని కక్ష సాధింపు చర్యలు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దని క్యాడర్ కు చంద్రబాబు హితవు పలికారు. ఎమ్మెల్యేలు, నేతలు కిందిస్థాయి కార్యకర్తలను విస్మరించకూడదని స్పష్టం చేశారు. బాధ్యతతో, చిత్తశుద్ధితో పని చేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారని సూచించారు.

🕒 16 Jun 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/people-will-support-chandrababu-again-if-he-works-with-sincerity%C2%A0/article-1981

Related Posts