బాలిక మిస్సింగ్ కేసుపై పవన్ సీరియస్.. వెతికి పట్టుకోవాలంటూ సీఐకి ఫోన్

బాలిక మిస్సింగ్ కేసుపై పవన్ సీరియస్.. వెతికి పట్టుకోవాలంటూ సీఐకి ఫోన్

 

 

ఆంధ్రప్రదేశ్ కి పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం గా తన పనితనం ఏంటో చూపిస్తున్నారు. జనం కోసం నేను  జనంలో నేను అంటు ప్రజల సమస్యలను ఐదు సంవత్సరాల కాలంలో తాను పరష్కారం చేయాలనుకున్న కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని సంపదించుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా  దానిలో ప్రత్యెకత ఉండాల్సిందే అంటున్నారు. 

ఎమేల్యె పదవి కోసం దశాబ్దాలుగా ఎదురు చూసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం పదవి లో వున్నారు. జనవాణి సభలో ప్రజల నుంచి వినతిపత్రాలను అందుకుని వాటిని పరిష్కరించడంలో దృష్టి పెట్టారు. అందులో భాగంగానే శివకుమారి తన కూతురు కనిపించడం లేదని పవన్ ను ఆశ్రయించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన శివకుమారి డిప్యూటీ సీఎంకి ఫిర్యాదు చేసింది. విజయవాడలో చదువుకుంటున్న తన  కుమార్తెను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశారని పవన్ కల్యాణ్ కి మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్‌ స్టేషన్లో కంప్లెట్ చేసినా..  స్పందించడం లేదని మొరపెట్టుకుంది శివకుమారి.
 
ఈ విషయంపై స్పందించిన పవన్ కల్యాణ్.. మైనర్ బాలిక ఎక్కడ ఉందో తెలుసుకోవాలిని  తానే స్వయంగా మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలను తెలుకున్నారు. బాలిక ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం జనసేన నాయకులను ఇచ్చి బాధితులను మాచవరం పోలీసు స్టేషన్ కు పంపించారు. వేంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలిక కోసం ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు.