హనుమవిహారి కి అండగా ఉంటా.. నారా లోకేష్ ప్రకటన
On
హనుమ విహారికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. మంగళవారం క్రికెటర్ హనుమ విహారి వెళ్లి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం స్టార్ క్రికెటర్ అయిన హనుమ విహారిని వేధించిందని.. అందుకే ఆయన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని వివరించారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన్ను విశేష గౌరవంతో తిరిగి ఆహ్వానిస్తోందని.. ఆయన మళ్లీ ఏపీ క్రికెట్ జట్టులోకి రావాలని కోరారు. ఇక నారా లోకేష్ ఆహ్వానానికి హనుమ విహారి కూడా సానుకూలంగా స్పందించారు. తాను గతంలో ఇబ్బంది పడ్డప్పుడు నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అండగా ఉన్నారని ఈ సందర్భంగా అతను గుర్తు చేసుకున్నారు.



