రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

రామోజీరావు అంత్యక్రియల్లో టీడీపీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు పాడెను మోసి అంతిమ వీడ్కోలు పలికారు.

ఈనాడు అధినేత రామోజీరావు ఇవాళ(ఆదివారం ఫిలింనగర్‌లో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామోజీరావు అంతిమ యాత్రను రామోజీ గ్రూపు కార్యాలయాల మీదుగా కొనసాగింది. స్మృతివనంలోని నిర్మించిన స్మారక కట్టడానికి ఆయన భౌతికకాయన్ని చేర్చారు.

రామోజీరావు అంత్యక్రియల్లో టీడీపీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు పాడెను మోసి అంతిమ వీడ్కోలు పలికారు. అదేవిధంగా ‘ జోహార్ రామోజీరావు గారు’ అంటూ ఉద్యోగులు, సిబ్బంది నినాదాలు చేశారు. అంతిమ యాత్రలో బీజేపీ తెలంగాణ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు నారా లోకేశ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.హనుమంతరావు,  నామా నాగేశ్వర‌రావు, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, అరికెపూడి గాంధీ, జూపల్లి కృష్ణారావు, వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. 

Read More సూర్యాపేటలో  డ్రైనేజీ రోడ్డు నిర్మాణం లేక పారుతున్న మురుగునీరు