టీడీపీ ఏజెంట్‌కు గుండెపోటు

టీడీపీ ఏజెంట్‌కు గుండెపోటు

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సమయంలో వేళ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సెగ్మెంట్‌లో టీడీపీ ఏజెంట్ రమేశ్ గుండెపోటుకు గురయ్యాడు.

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సమయంలో వేళ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సెగ్మెంట్‌లో టీడీపీ ఏజెంట్ రమేశ్ గుండెపోటుకు గురయ్యాడు. నరసరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని ఏజెంట్‌గా అవకాశం కల్పించారు. 

కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు, పారా మిలటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించి పూర్తి స్థాయి ఆంక్షలను విధించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారు.

Read More  రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు