జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే కృషి
- అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తాం: కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి
విశ్వంభర, షాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు, ఉచిత హెల్త్ కార్డులు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి యూనియన్‌ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా మాట్లాడుతూ మండల స్థాయి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు నమోదైతే లీగల్ సెల్ ద్వారా పూర్తి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా షాబాద్ మండల టీయూడబ్ల్యూజే నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దర్పల్లి రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఏగూరి మల్లికార్జున్ ఎన్నిక కాగా, ఇతర కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతన కమిటీ సభ్యులు జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు