సీఐ దేవానంద్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ ఆరోపణలు

  • సీఐ దేవానంద్‌పై ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ సంచలన ఆరోపణలు.. డీఐజీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి

Andhra Pradesh Police: అనంతపురం నగరంలోని రాంనగర్ కార్తికేయ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ఆర్‌ఎస్‌ఐ ఎస్‌.పీ. రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సీఐ కె. దేవానంద్, ఆయన భార్య రూప వల్ల తనకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని జిల్లా డీఐజీని కోరారు.

ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ కథనం ప్రకారం.. గత జూలై 30న సీఐ దేవానంద్ తనపై దాడి చేసి లాఠీతో కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనలో తన కుడి చేయి విరిగిందని, కంటికి కూడా గాయమైందని తెలిపారు. అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత మరుసటి రోజు జిల్లా డీఐజీని కలిసి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Read More వైజాగ్‌లో నేడు బీజేపీ విస్తృతస్థాయి సమావేశం.. నితిన్ నబిన్ అధ్యక్షతన కీలక భేటీ

తమపై దాడి జరిగినప్పటికీ, తమనే తప్పుబడేలా మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేశారని రామకృష్ణ ఆరోపించారు. తన వాదనను వినకుండా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేయడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అన్నారు. న్యాయం కోసం అనంతపురం ప్రెస్ క్లబ్‌ను ఆశ్రయించినా తనకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై జిల్లా డీఐజీ సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

🕒 05 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/rsi-appeals-to-do-justice-to-the-allegation-of-assault/article-20982

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి