V3 న్యూస్ ఛానల్‌ జర్నలిస్టులకు స్టేట్ అక్రిడిటేషన్ కార్డులు అందజేసిన చైర్మన్ కాచం సత్యనారాయణ

విశ్వంభర,హైదరాబాద్ : ప్రముఖ V3 న్యూస్ ఛానల్‌లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక స్టేట్ అక్రిడిటేషన్ కార్డులను మంగళవారం చైతన్యపురిలోని ఛానల్ ప్రధాన కార్యాలయంలో V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ జర్నలిస్టులకు స్వయంగా అందజేశారు .ఈ సందర్భంగా  కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు అక్రిడిటేషన్ కార్డులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సుకై నిరంతరం శ్రమిస్తూ, నిష్పక్షపాత వార్తలను ప్రజలకు చేరవేస్తు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని జర్నలిస్ట్ లకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ ఛానల్ బ్యూరో చీఫ్ దుమ్మాజీ నవీన్, సబ్ ఎడిటర్ కాసం సాయి, సాగర్, సీనియర్ జర్నలిస్ట్ లు ఖలీల్, రామ్ నరేష్,వీడియో జర్నలిస్ట్ లు గురుమూర్తి, శ్రీధర్,యాదగిరి  పాల్గొన్నారు.

🕒 04 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chairman-katcham-satyanarayana-presented-state-accreditation-cards-to-v3-news/article-20966

Tags: