పవిత్ర బంధానికి విషం.. ప్రియుడితో కలిసి భర్తలనే టార్గెట్ చేస్తున్న కిల్లర్ వైఫ్స్
నమ్మకానికి పాతర.. భర్త ప్రాణాలను బలితీసుకుంటున్న క్రైమ్ పార్టనర్స్
Nizamabad News: క్షణిక వ్యామోహం.. నూరేళ్ల బంధాన్ని కాలరాసింది. కట్టుకున్న భర్త, ఆదరించిన అత్త తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భావించిన ఓ మహిళ, వారిని అత్యంత దారుణంగా చంపేందుకు 'సైలెంట్ స్కెచ్' వేసింది. ఇంట్లో రోజూ వండుకునే కూరలోనే గడ్డి మందు (విషం) కలిపి వడ్డించి, వారి ప్రాణాలు తీసేందుకు యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
పథకం ప్రకారం స్కెచ్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం మదక్‌పల్లి గ్రామానికి చెందిన సోని (33), ఆమె భర్త భూమయ్య, అత్త భూదేవ్వతో కలిసి నివసిస్తోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, సోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నట్లు సమాచారం. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కక్షతో భర్తను, అత్తను శాశ్వతంగా వదిలించుకోవాలని సోని మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే మధ్యాహ్న భోజన సమయంలో, తానెంతో ప్రేమగా వండినట్లు నటిస్తూ కూరలో ప్రాణాంతకమైన గడ్డి మందు కలిపి భర్త, అత్తలకు వడ్డించింది.
అనుమానంతో ప్రాణాలు దక్కాయి..
భోజనం చేసిన కొద్దిసేపటికే అత్త భూదేవ్వకు తీవ్రమైన వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు భర్త భూమయ్యకు తీవ్రంగా తలతిరిగి అస్వస్థతకు గురయ్యాడు. భోజనం రుచి, శరీరంలో వచ్చిన మార్పులతో భూమయ్యకు అనుమానం వచ్చింది. వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల వారికి, గ్రామస్థులకు విషయం తెలిపాడు. స్థానికులు క్షణం ఆలస్యం చేయకుండా ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. కొద్దిగా ఆలస్యమైనా ఇద్దరి ప్రాణాలు దక్కేవి కాదంటూ వైద్యులు తెలిపారు.
ప్రియుడి మోజులో ఊసలు లెక్కపెట్టింది..
ఆస్పత్రి నుంచి తేరుకున్న భర్త భూమయ్య, అత్త భూదేవ్వ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోపాల్ పోలీసులు వెంటనే రంగాంలోకి దిగారు. విచారణలో సోని రాక్షస కోణం, లభించిన ఆధారాలు చూసి పోలీసులే దిగ్భ్రాంతి చెందారు. నిందితురాలు సోనిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించి జైలుకు తరలించింది.