హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నారు.. సీఎం రేవంత్‌పై ఈటల ఫైర్

హైడ్రాతో పేదల ఇళ్లు కూల్చుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై ఈటల ఆరోపణలు

ETALA RAJENDER NEWS:  బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో హైడ్రా (HYDRAA) వ్యవహారంపై ఆయ‌న మండి ప‌డ్డారు. హైడ్రా అనేది ప్రజలను వేధించే సంస్థగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారులను నియమించే విచక్షణాధికారం కలిగి ఉండొచ్చని, అయితే ప్రజల ఇళ్లను కూల్చివేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రాను ఏర్పాటు చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. హిట్లర్ ప్రజలను ఎలా వేధించాడో, అదే విధంగా హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం ప్రజల్లో హైడ్రా అంటే భయాందోళనలు నెలకొన్నాయని, పేదల ఇళ్లను కూల్చివేసే సంస్థగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.

వ్య‌తిరేకంగా మాట్లాడితే బ్లాక్‌మొయిల్ చేస్తారా?

Read More దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి

అంతేకాకుండా, తమకు అనుకూలంగా ఉన్న వారికి భూములు కట్టబెట్టేందుకు, వ్యతిరేకంగా మాట్లాడే వారిని బ్లాక్‌మెయిల్ చేయడానికే హైడ్రాను ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించారు. హైడ్రా చర్యల కారణంగా హైదరాబాద్‌లో ఇల్లు కొనాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల రియల్ ఎస్టేట్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని వ్యాఖ్యానించారు. హైడ్రా పేరుతో జరుగుతున్న చర్యలను ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులు, హక్కులను పరిరక్షించే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు.

🕒 04 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/6a716b6f6b743/article-20942

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు