వేధింపులు వల్లే నా భర్త మృతి..కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు

రూ.7.20 లక్షల వివాదం.. వేధింపులతో భర్తను కోల్పోయానంటూ మహిళ ఆరోపణలు

Anantapuram News: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం అనంతసాగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. తన భర్త శ్యాముల్ శ్రీనివాస్ మృతికి అరుణకుమారి, దివాకర్తో పాటు మరికొందరి వేధింపులే కారణమని ఆయన భార్య సావిత్రి ఆరోపణలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, న్యాయం కోసం పోరాడుతూ చివరకు తన భర్తను కోల్పోయానంటూ కన్నీరుమున్నీరయ్యారు.

సావిత్రి కథనం ప్రకారం.. తన భర్త తమ్ముడు శ్రీకాంత్ బ్యాంకు రుణం పేరుతో సుమారు రూ.5 లక్షలు తీసుకున్నాడని, అనంతరం అతని భార్య అరుణకుమారి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మరో రూ.2.20 లక్షలు తీసుకుందని తెలిపారు. ఇలా మొత్తం రూ.7.20 లక్షలు తీసుకున్నప్పటికీ తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. శ్రీకాంత్ మృతి చెందిన తర్వాత కూడా అరుణకుమారి డబ్బులు ఇస్తానని చెబుతూ కాలయాపన చేస్తూ, తమను మానసికంగా వేధించిందని వాపోయారు.

Read More క్రోచెట్ కళాకారులకు పవన్ కళ్యాణ్ చేయూత.. ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ

ఇటీవల బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌లో అరుణకుమారితో పాటు దివాకర్, పుష్పరాజు, టీటీ వెంకటేశు, సుభాను, సైకిల్ షాప్ ఇస్మాయిల్ తదితరులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని సావిత్రి ఆరోపించారు. ఆ బెదిరింపులు, అవమానాలు, మానసిక ఒత్తిడి కారణంగానే తన భర్త తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మృతికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.

🕒 04 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/my-husbands-death-was-due-to-harassment-but-i-complained/article-20950

Advertisement

LatestNews

ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు