బట్టలు చించి, కర్రలతో దాడి.. యూపీలో పోలీసులపై కన్వరియాల ఆగ్రహం

  • బైకర్ పరారయ్యాడంటూ పోలీసులపై విరుచుకుపడ్డ కన్వరియాలు

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గంగాజలాన్ని తీసుకుని యాత్ర చేస్తున్న కన్వరియాలపై ఓ బైకర్ ప్రమాదవశాత్తు ఢీకొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బైకర్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇద్దరు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.

అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే బైకర్ పరారయ్యాడు. దీంతో ఆగ్రహానికి గురైన కన్వరియాలు "మీ వల్లే అతడు తప్పించుకున్నాడు" అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించిన పోలీసులపైనే ఒక్కసారిగా దాడికి దిగారు. పోలీసుల యూనిఫాం బట్టలు చించి, కర్రలతో వెంటాడుతూ దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read More సారా తాగితే చిరుత ఎలా ఉంటుందో చూశారా?

దాడి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అదనపు పోలీసు బలగాలను అక్కడికి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన పోలీసులకు వైద్య చికిత్స అందించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడిలో పాల్గొన్న కన్వరియాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వీడియో ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

🕒 04 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/national/kanwariya-attack-on-police-is-a-tense-incident-in-meerut/article-20934

Advertisement

LatestNews

ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు