వర్షానికి బస్సులే చిక్కుకుపోతే.. ప్రయాణికుల పరిస్థితి ఏంటి?
- చినుకులకే చిత్తడిగా బస్‌స్టాండ్.. బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు
Hyderabad RTC Bus: హైదరాబాద్‌లోని ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్‌స్టాండ్ దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. చిన్నపాటి వర్షానికే బస్‌స్టాండ్ మొత్తం బురదమయంగా మారడంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బురదలో కూరుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బస్సు టైర్లు పూర్తిగా బురదలో ఇరుక్కుపోవడంతో సిబ్బంది ఎంత ప్రయత్నించినా బయటకు తీయలేకపోయారు. చివరకు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు కూడా బురదలో నడుచుకుంటూ బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
తాత్కాలిక బస్‌స్టాండ్‌లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సులే బురదలో కూరుకుపోతుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించాలని కోరుతున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక బస్‌స్టాండ్‌లో తక్షణమే మురుగు నీటి పారుదల, రోడ్డు బలోపేతం వంటి చర్యలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు, ప్రయాణికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.