క్లాస్‌లో టీచర్ నిద్ర.. మొబైళ్లతో బిజీ అయిన విద్యార్థులు.. ఎక్క‌డంటే?

నిద్రలో టీచర్.. మొబైళ్లలో విద్యార్థులు.. వైరల్ వీడియోతో కలకలం

Teacher Sleeping Viral Video: ఒకప్పుడు పాఠశాల అంటే ఒక పవిత్రమైన గుడి.. గురువు అంటే ప్రత్యక్ష దైవం! ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగుపెడితే క్రమశిక్షణ, శ్రద్ధ, నేర్చుకోవాలనే తపన కనిపించేవి. ఏ విద్యార్థి అయినా పాఠం వినకుండా నిద్రపోతే గురువు మందలించి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దేవారు. కానీ కాలం మారింది.. విలువలు తలకిందులయ్యాయి! నేడు కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపం విద్యా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా ఉమర్దా బ్లాక్ పరిధిలోని సిక్రోరీ కాంపోజిట్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలిచింది.

వైరల్ అవుతున్న వీడియో..

Read More సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు

ఓ ఉపాధ్యాయుడు తరగతి గదిలో బల్లపై తలవాల్చి నిద్రపోతుండగా, ఎదురుగా కూర్చున్న విద్యార్థులు ఎలాంటి పాఠాలు లేకుండా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, పర్యవేక్షణ, ఉపాధ్యాయుల బాధ్యతలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. వీడియో వెలుగులోకి రావడంతో స్థానిక విద్యాశాఖ అధికారులు ఘటనపై దృష్టి సారించారు. వైరల్ వీడియోలోని అంశాలపై విచారణ చేపట్టి, వాస్తవాలు నిర్ధారించిన తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.

🕒 04 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/national/where-are-the-students-who-are-busy-with-their-mobiles/article-20940

Advertisement

LatestNews

ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు