తెలంగాణలో 60 లక్షల ఓట్లు తొలగే అవకాశం?

తెలంగాణలో 60 లక్షల ఓట్లు తొలగే అవకాశం?

  • ఓటర్ల జాబితా సవరణలో భారీ మార్పులు.. 60 లక్షల ఓట్లపై అధికారుల అంచనా

Telangana SIR: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తయ్యే నాటికి సుమారు 60 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలో లక్షలాది మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు బయటపడుతున్నాయని తెలుస్తోంది.

అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం, దాదాపు 40 లక్షల మంది ఓటర్లు జాబితాలో నమోదైన చిరునామాల్లో ప్రస్తుతం నివసించడం లేదని గుర్తించారు. వీరిలో ఇతర ప్రాంతాలకు మారిపోయిన వారు, చిరునామా మారిన వారు, అందుబాటులో లేని వారు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీరి వివరాలను మరింతగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Read More కట్ట మైసమ్మ ఆలయంలో  ఘనంగా బోనాలు

అదేవిధంగా, ఇప్పటికే మరణించిన వారి పేర్లు, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నవారు, ఒకే వ్యక్తికి రెండు లేదా మూడు చోట్ల ఓటరు నమోదైన కేసులు కలిపి మరో 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం సుమారు 60 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

అయితే, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించే ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, ధ్రువీకరణ అనంతరం మాత్రమే తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ వివరాలను ఒకసారి తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

🕒 05 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/60-lakh-votes-are-likely-to-be-lost-in-telangana/article-20978

Tags:  

Advertisement

LatestNews

అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు
సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం