ముస్తఫా అరెస్ట్ రాజకీయ కక్షసాధింపే.. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు
- ముస్తఫా అరెస్ట్‌ను ఖండించిన వైఎస్సార్‌సీపీ నాయకులు.
YSRCP Press Meet: నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు సైఫుల్లా, వసీం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాన్ని రాజకీయ కోణంలో చూపిస్తూ అక్రమంగా అరెస్ట్ చేశారని వారు ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వరుసగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని సైఫుల్లా, వసీం విమర్శించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రంలో మైనారిటీలపై కక్షసాధింపు చర్యలు పెరిగాయని, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ నాయకులు లేదా కార్యకర్తలు ప్రభుత్వం మీద విమర్శలు చేసినా కేసులు నమోదు చేస్తున్నారని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని అన్నారు. రాజకీయ వేధింపులు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు.