రాజ్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత

రాజ్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత

  • నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీపై బీఆర్ఎస్‌వీ నిరసన
  • పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ 

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం(బీఆర్ఎస్‌వీ) ఆధ్వర్యంలో మంగళవారం రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.రాజ్‌భవన్‌కు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌పై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నీట్‌ పరీక్షలపై కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Read More జిల్లాను లెప్రసి రహిత జిల్లాగా ప్రకటించాలి