మహేశ్వరంలో వీధి కుక్కల స్వైర విహారం.. ప్రజలకు కంటి మీద కునుకు కుండా చేస్తున్న శునకాలు
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో వీధి కుక్కల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన చౌరస్తాతో పాటు రద్దీ రహదారులు, కాలనీలు, పాఠశాలల పరిసరాల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనదారులను వెంటాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో పలువురు వాహనదారులు అదుపు తప్పి కిందపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన చౌరస్తా మీదుగా ప్రతిరోజూ వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సమయంలో ఒక్కసారిగా కుక్కలు వాహనాల వెనుక పరుగులు తీయడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటోందని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో కూడా వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. చిన్నారులు బయటకు వెళ్లేందుకు సైతం తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు, కుక్కకాటు ఘటనలు జరగకముందే వీధి కుక్కలను పట్టుకుని డాగ్ షెల్టర్‌కు తరలించాలని, ప్రధాన చౌరస్తా, పాఠశాలల పరిసరాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.