గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తా: సర్పంచ్ నవీన్

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని వివిధ కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నూతన పైప్‌లైన్ పనులను ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ తెలిపారు. గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు రూ.15 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో పైప్‌లైన్ ఏర్పాటు పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ఎవరూ తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, తాగునీటి సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జొరల రమేష్, వార్డు సభ్యులు, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి సుజాత, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sarpanch-naveen-will-make-the-village-water-free/article-20082

Tags: